ఉమ్మడి కర్నూలు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన జిల్లాస్థాయి ఎంపిక పోటీల్లో నందవరం జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు జగన్, పవన్ కుమార్ అద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. కఠినమైన పోటీ మధ్య తమ శక్తి సామర్థ్యాలను చాటుతూ ఈ విజయం సాధించారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామకృష్ణరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.