వ్యవసాయం తర్వాత రెండవ ప్రాధాన్యత రంగమైన చేనేత రంగం సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి బాలకృష్ణ పిలుపునిచ్చారు. ఎమ్మిగనూరు తాలూకా మహాసభ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమస్యలు పరిష్కరించకపోతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై పోరాటానికి సిద్ధం కావాలని కార్మికులకు సూచించారు. ఈ మేరకు ఆదివారం ఎమ్మిగనూరులో సంఘం మహాసభ ఘనంగా నిర్వహించారు. అంతకుముందు సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ర్యాలీ నిర్వహించారు.