ఎమ్మిగనూరు పట్టణంలోని 5వ వార్డు సచివాలయంలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో 5వ వార్డు
టీడీపీ ఇంచార్జి, మాజీ కౌన్సిలర్ రంగస్వామి గౌడ్ పాల్గొన్నారు. ఆయన చిన్నారులకు పోలియో చుక్కలు వేసి, ప్రతి తల్లిదండ్రులు తమ 5 సంవత్సరాల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించి, పోలియో రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం శాసనసభ్యులు డాక్టర్ బి.వి.జయనాగేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు జరిగింది.