రాయలసీమ యూనివర్సిటీలో వీసీ, రిజిస్ట్రార్‌పై వస్తున్న అవినీతి ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని ఆర్పీఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి షాహిద్ ఆఫ్రిది డిమాండ్ చేశారు. అక్రమాలను ప్రశ్నించినందుకు జిల్లా అధ్యక్షుడు నాగరాజుపై కేసులు నమోదు చేయడం, విద్యార్థి సంఘాల నాయకులను యూనివర్సిటీ నుంచి తొలగించడం అన్యాయమని ఆయన పేర్కొన్నారు. విద్యార్థుల సమస్యలు, అవినీతి అంశాలను ప్రస్తావించడం నేరం కాదని, ప్రభుత్వం వెంటనే స్పందించి విచారణ చేపట్టి కేసులను ఎత్తివేయాలని, లేదంటే విద్యార్థి సంఘాలతో కలిసి ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. కర్నూలు, ఎమ్మిగనూరు ప్రాంతాల్లో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి.