ఎమ్మిగనూరులోని వైఎస్ఆర్ సర్కిల్ లక్ష్మీ స్వీట్స్ షాప్ వద్ద శుక్రవారం కెనరా బ్యాంకులో నగదు విత్డ్రా చేసుకుని వచ్చిన రంగారెడ్డి అనే వ్యక్తి తన బైక్ డిక్కీలో ఉంచిన రూ.2 లక్షలను దొంగ ఎత్తుకెళ్లాడు. బాధితుడు స్వీట్ షాప్ వద్దకు వచ్చి చూసేసరికి నగదు మాయమవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని, పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి కోసం గాలింపు ముమ్మరం చేశారు.