షబ్బేబ్బరాత్: స్మశానంలో దువాకు కాంగ్రెస్ వినతి

512చూసినవారు
షబ్బేబ్బరాత్: స్మశానంలో దువాకు కాంగ్రెస్ వినతి
గోనెగండ్ల మండల పరిషత్ అభివృద్ధి శాఖ అధికారిణి మనీ మంజరికి, కాంగ్రెస్ పార్టీ నాయకులు గురువారం ఓ వినతి పత్రాన్ని సమర్పించారు. ఫిబ్రవరి 3వ తేదీన షబ్బేబ్బరాత్ సందర్భంగా స్మశాన వాటికలో ప్రత్యేక దువా కార్యక్రమాలు చేపడుతున్నామని, కావున కబరస్థాన్ వద్ద శుభ్రపరచాలని వారు కోరారు. ఈ మేరకు ముల్లా ఖాసింవలి, కడివెళ్ల హాజీ సాహెబ్, డి. మహబూబ్ సాహెబ్ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపారు.