నందవరం మండలం మాచాపురం గ్రామంలో ఆదివారం ఎస్సై తిమ్మారెడ్డి తన సిబ్బందితో కలిసి పర్యటించి, ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. మహిళల భద్రత, రక్షణకు సంబంధించిన నూతన చట్టాలు, వాటి ప్రాముఖ్యతను వివరించారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే ప్రకటనలను నమ్మి మోసపోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.