ఎమ్మిగనూరులో ఎస్‌ఐఆర్ శిక్షణ కార్యక్రమం

367చూసినవారు
ఎమ్మిగనూరులో ఎస్‌ఐఆర్ శిక్షణ కార్యక్రమం
ఎమ్మిగనూరు పట్టణంలోని కర్ణి కళ్యాణ మండపంలో శుక్రవారం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంపై అవగాహన కల్పించేందుకు వర్క్‌షాప్, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే డా. బి. వి. జయ నాగేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో క్లస్టర్లు, యూనిట్లు, బూత్ కన్వీనర్లు, గ్రామ, వార్డు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. బూత్ లెవల్ ఏజెంట్ల (బీఎల్‌ఏలు) పాత్ర, బాధ్యతలు, ఇంటింటి ఓటరు ధృవీకరణ, కుటుంబ వృక్షం ఆధారంగా ఓటర్ల మ్యాపింగ్, ఎన్యూమరేషన్ ఫారాల నింపడం, ఓటరు వివరాల పరిశీలన, ఎస్‌ఐఆర్ అప్‌లోడింగ్, మైటీడీపీ యాప్ ద్వారా వెరిఫికేషన్ ప్రక్రియలపై శిక్షణ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్