గోనెగండ్ల సింగిల్ విండో అధ్యక్షుడు ఎన్వి రామాంజనేయులు, టిడిపి మండల కన్వీనర్ తిరుపతయ్య నాయుడు, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డును కల్తీ నెయ్యితో తయారు చేసి వైసిపి మహా పాపం చేసిందని ఆరోపించారు. తిరుపతి దేవస్థానంలో జరిగిన ఈ కుంభకోణంపై సీట్ నివేదికతో వాస్తవం బయటకు వచ్చిందని, దీంతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. ఇప్పటికైనా వైసీపీ శ్రేణులు చేసిన తప్పులను గుర్తించాలని వారు అన్నారు. ఈ సమావేశంలో శ్రీధర్, చంద్ర, నజీర్ పాల్గొన్నారు.