వైసీపీ నేత అరెస్టుపై ధర్నా.. జిల్లా సాధన సమితి అడ్డుకోవడంతో ఉద్రిక్తత

620చూసినవారు
ఎమ్మిగనూరు పట్టణంలోని సోమప్ప సర్కిల్ ప్రధాన కూడలిలో, వైసిపి నేత అంబటి రాంబాబు అరెస్టును నిరసిస్తూ వైసిపి నాయకులు చేపట్టిన ధర్నాను, ఎమ్మిగనూరు జిల్లా సాధన సమితి నాయకులు అడ్డుకున్నారు. ఎమ్మిగనూరు జిల్లాకు మద్దతు ఇవ్వాలని వారు కోరడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో వైసిపి ఇన్చార్జ్ ఎర్రకోట రాజీవ్ రెడ్డి వాహనాన్ని కూడా అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు జిల్లా సాధన సమితి నాయకులను అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్