ఎమ్మిగనూరును జిల్లా కేంద్రంగా ప్రకటించేంతవరకు తమ ఉద్యమాన్ని ఆపేది లేదని జేఏసీ నేతలు స్పష్టం చేశారు. బుధవారం ఎమ్మిగనూరులో 25వ రోజు రాము, రాజేష్, చిన్ని, ప్రసాద్, రంగయ్య, నాని ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగాయి. పశ్చిమ ప్రాంతంలోని వెనుకబడిన ఐదు నియోజకవర్గాలను జిల్లా స్థాయికి చేర్చాలని, భౌగోళిక పరిస్థితులను అధ్యయనం చేసి అభివృద్ధి చేయాలని వారు డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం జిల్లా ప్రకటన చేయాలని, ఆర్డీఎస్, వేదవతి ప్రాజెక్టులను తక్షణమే పూర్తి చేయాలని వారు కోరారు.