తిరుపతి లడ్డు ప్రసాదంలో జంతు కొవ్వు కలిపారన్న ఆరోపణలు పూర్తిగా అసత్యమని, కోర్టుకు సమర్పించిన చార్జీషీట్‌లో ఇది స్పష్టమైందని ఎమ్మిగనూరు నియోజకవర్గ సమన్వయకర్త ఎర్రకోట రాజీవ్ రెడ్డి తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ, కోర్టులో నిజాలు వెలుగులోకి వచ్చినప్పటికీ దుష్ప్రచారం కొనసాగించడం దురదృష్టకరమని అన్నారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎమ్మిగనూరు పట్టణంలోని శ్రీవెంకటసాయి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి 101 టెంకాయలు కొట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడి లడ్డు విషయంలో జరిగిన విషప్రచారాన్ని ఖండించారు.