చంద్రబాబు ఎమ్మిగనూరు పర్యటనను అడ్డుకుంటాం: ఏఐవైఎఫ్

అపద్ధపు హామీలతో అధికారం చేపట్టిన సీఎం చంద్రబాబు, ఎమ్మిగనూరు పర్యటనను అడ్డుకుంటామని ఏఐవైఎఫ్ నాయకులు గురువారం హెచ్చరించారు. నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగాలు కల్పిస్తానని, నిరుద్యోగ భృతి ఇస్తానని ఇచ్చిన అబద్ధపు హామీలపై సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నేటికీ నోటిఫికేషన్ ఇవ్వలేదని ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి రాజీవ్, జిల్లా సమితి సభ్యులు ఎం. రాజు ఆవేదన వ్యక్తం చేశారు.
