టాలీవుడ్‌లో 'చికిరి చికిరి' పాట సృష్టించిన సంచలనం తర్వాత, నాని నటించిన 'ది ప్యారడైజ్' సినిమాలోని 'ఆయా షేర్' పాట లైకుల విషయంలో దానిని అధిగమించింది. 'చికిరి' పాట 24 గంటల్లో 46 మిలియన్ల వ్యూస్‌తో పాటు, నాలుగు నెలల్లో 13 లక్షలకు పైగా లైకులను సాధించింది. అయితే అనిరుధ్ స్వరపరిచిన 'ఆయా షేర్' పాట కేవలం నెల రోజుల్లోనే ఈ లైకులను క్రాస్ చేసిందని మ్యూజిక్ లవర్స్ అంటున్నారు. ప్రస్తుతం 'చికిరి'కి 197 మిలియన్ల వ్యూస్ ఉండగా, 'ఆయా షేర్'కి 91 మిలియన్ల వ్యూస్ ఉన్నాయి.