నేచురల్ స్టార్ నాని తన వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై కంటెంట్‌కు ప్రాధాన్యతనిస్తూ మరో కొత్త ప్రాజెక్ట్‌ను నిర్మించనున్నారు. విమర్శకుల ప్రశంసలు అందుకున్న దండోరా ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. హీరోయిన్‌గా రుక్మిణి వసంత్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా, కథకు సరిపోయే హీరో కోసం చిత్ర బృందం అన్వేషిస్తోంది. ఆగస్టులో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.