దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తన రెండో చిత్రం 'ది ప్యారడైస్'తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ యాక్షన్ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. నాని పుట్టినరోజు సందర్భంగా ఫిబ్రవరి 24న తొలి పాట విడుదల చేయాలని మేకర్స్ యోచిస్తున్నట్లు సమాచారం. ఈ పాటలో నాని మేనరిజం, మెంటల్ మాస్ స్వాగ్ కనిపించేలా ట్యూన్ కంపోజ్ చేశారని ప్రచారం జరుగుతోంది. ఈ మూవీ మార్చి 26న తెలుగుతో పాటు ఎనిమిది భాషల్లో పాన్ వరల్డ్ మూవీగా విడుదల కానుంది.