నానో స్థాయి గుళికలతో ఎలుకలపై జరిపిన ప్రయోగాల్లో కఠినమైన ట్రిపుల్ నెగటివ్ రొమ్ము కేన్సర్ కణితి పెరుగుదలను మందగించినట్లు టెక్‌నియాన్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ నానో కణాలను ఎంపీసోమ్స్ అని పిలుస్తారు. ఇవి కేన్సర్ కణాలు రోగ నిరోధక వ్యవస్థను ఏమార్చేందుకు ఉపయోగించే తెల్ల రక్త కణాలతో పోటీపడి, కణితికి రక్షణ కవచంగా ఏర్పడి, దాని పెరుగుదలను నిరోధిస్తాయి. ఈ పరిశోధన
ఫలితాలు ఏసీఎస్ నానో జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఈ పద్ధతి ద్వారా నిమిషానికి 20 మిల్లీలీటర్ల నానో కణాలను తయారు చేయవచ్చని, తయారీకి వాడిన పదార్థాలు సురక్షితమైనవని పరిశోధకులు తెలిపారు.