AP: దమ్ముంటే తమ అకౌంట్ కాపీలు చూపించాలని మంత్రి లోకేశ్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు మాజీ మంత్రి పేర్ని నాని సవాల్ విసిరారు. వైఎస్ జగన్ పర్యటన ఫ్లైట్ ఖర్చులపై కూటమి నేతలు చేస్తున్న విమర్శలకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మంత్రి లోకేశ్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విమానాల్లో తిరిగేందుకు వారానికి రూ. 20 లక్షలు అవుతోందని పేర్ని నాని ఆరోపించారు. ఆ డబ్బులు ఎవరు కడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.