నారా లోకేశ్ సీఎం.. ఈ ప్రచారం నిజమేనా?

101చూసినవారు
నారా లోకేశ్ సీఎం.. ఈ ప్రచారం నిజమేనా?
AP: నారా లోకేశ్ సీఎం అవుతారని రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఉగాది వేళ ఏపీలో నాయకత్వం మార్పు ఉంటుందని, లోకేశ్ సీఎంగా బాధ్యతలు తీసుకుంటారని, చంద్రబాబు పార్టీ రాజకీయాలు చూసుకుంటారని ప్రచారం జరుగుతోంది. మిత్ర పక్షాలు జనసేన, బీజేపీ కూడా ఈ నాయకత్వం మార్పిడిని అంగీకరిస్తుందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఈ ప్రచారంపై టీడీపీని బలపరిచే రాజకీయ విశ్లేషకులు ఖండిస్తున్నారు. కూటమిలో చీలిక తీసుకురావడానికి ప్రత్యర్థులు చేస్తున్న ప్రచారం మాత్రమేనని చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్