AP: పల్నాడు జిల్లా నరసరావుపేట ASI శ్రీనివాసరావుపై బదిలీ వేటు పడింది. ఈ నెల 4న చిలకలూరిపేటలో బ్రేక్ ఇన్‌స్పెక్టర్‌ని అంటూ ASI శ్రీనివాసరావు కుమారుడు వెంకటనాయుడు లారీని ఆపారు. దాంతో లారీని కారు ఢీకొనడంతో ఐదుగురు విద్యార్థులు మృతి చెందారు. గతంలో వెంకటనాయుడి పలు అవినీతి పనుల్లో తండ్రి శ్రీనివాసరావు పాత్ర ఉందని అభియోగాలు వచ్చాయి. దాంతో శ్రీనివాసరావుని బదిలీ చేస్తూ ఎస్పీ చర్యలు తీసుకున్నారు.