నాసా (NASA) తన ఆర్టెమిస్ II మిషన్ ద్వారా 50 సంవత్సరాల తర్వాత మళ్లీ మనుషులను చంద్రుడి చుట్టూ పంపించేందుకు సిద్ధమైంది. ఈ చారిత్రాత్మక ప్రయోగం ఏప్రిల్ 1న ఫ్లోరిడాలోని కెనెడీ స్పేస్ సెంటర్‌లోని ప్యాడ్ 39B నుంచి భారత కాలమానం ప్రకారం రాత్రి 10:54 గంటలకు జరగనుంది. నలుగురు వ్యోమగాములు పాల్గొనే ఈ మిషన్ ఏప్రిల్ 10న ముగియనుంది.