చంద్రుడిపై మనిషి కాలు మోపేందుకు నాసా సన్నాహాలు

2126చూసినవారు
చంద్రుడిపై మనిషి కాలు మోపేందుకు నాసా సన్నాహాలు
అమెరికా అంతరిక్ష సంస్థ నాసా, 2026 జూన్‌ 9న 'ఆర్టెమిస్‌ 3' యాత్రకు నలుగురు వ్యోమగాములను ప్రకటించింది. రాండీ బ్రెస్నిక్‌ కమాండర్‌గా, లూకా పర్మిటానో పైలట్‌గా, ఫ్రాంక్‌ రూబియో, ఆండ్రే డగ్లస్‌ మిషన్‌ స్పెషలిస్ట్‌లుగా ఎంపికయ్యారు. ఈ యాత్ర 2027 చివర్లో ప్రారంభం కానుంది. ల్యాండర్‌ వాహనాలు సిద్ధం కాకపోవడంతో, వ్యోమగాములు చంద్రుడిపై దిగకుండా లోఎర్త్‌ ఆర్బిట్‌లోనే ఉంటారు. ప్రధాన లక్ష్యం ఓరియన్‌ వ్యోమనౌకను, స్పేస్‌ఎక్స్, బ్లూ ఆరిజిన్‌ తయారు చేస్తున్న ల్యాండింగ్‌ సిస్టమ్‌ వాహనాలతో అనుసంధానం చేయడం. మనుషులు చివరిసారిగా 1972 డిసెంబర్‌లో చంద్రుడిపై దిగారు. ఆర్టెమిస్‌ 3 విజయవంతమైతే, 2028లో ఆర్టెమిస్‌ 4 యాత్ర మనుషులను చంద్రుడిపై దించుతుంది.

సంబంధిత పోస్ట్