విశాఖ తీరంలో గల్లంతైన ఓ మత్స్యకారుడిని కాపాడిన నేవీ

16334చూసినవారు
విశాఖ తీరంలో గల్లంతైన ఓ మత్స్యకారుడిని కాపాడిన నేవీ
AP: విశాఖ తీరంలో గల్లంతైన మత్స్యకారుడిని భారత నావికాదళం రక్షించింది. ఈ నెల 5వ తేదీన గల్లంతైన మత్స్యకారుడిని సమీపంలోని వాణిజ్య నౌక రక్షించి ఆశ్రయం కల్పించింది. అనంతరం తూర్పు నౌకాదళ కమాండ్ హెలికాప్టర్ ద్వారా అతడిని సురక్షితంగా తీరానికి చేర్చారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది.

సంబంధిత పోస్ట్