తిరుమల శ్రీవారిని కోలీవుడ్ దర్శకుడు విఘ్నేష్ శివన్, నటి నయనతార దంపతులు గురువారం దర్శించుకున్నారు. విఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్న ఈ జంటకు ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. దర్శనానంతరం వేద ఆశీర్వచనం అందుకున్నారు. నయనతార సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోగా, విఘ్నేష్ పంచెకట్టులో ఆకట్టుకున్నారు.