2.82 కోట్ల మందికి NCD పరీక్షలు పూర్తి: మంత్రి సత్యకుమార్

39చూసినవారు
2.82 కోట్ల మందికి NCD పరీక్షలు పూర్తి: మంత్రి సత్యకుమార్
AP: రాష్ట్రవ్యాప్తంగా అసంక్రమిక వ్యాధుల (NCD) నివారణ, ముందస్తు గుర్తింపు లక్ష్యంగా చేపట్టిన ఆరోగ్య సర్వే ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటి వరకు 2.82 కోట్ల మందికి ఎన్‌సీడీ పరీక్షలు పూర్తి చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ సర్వేలో 59.29 లక్షల మందికి రక్తపోటు (బీపీ), 48.15 లక్షల మందికి మధుమేహం (షుగర్) ఉన్నట్లు గుర్తించారు. మారిన ఆహార అలవాట్లు, శారీరక శ్రమ తగ్గడం వంటి కారణాలు ఈ వ్యాధుల తీవ్రతకు దారితీస్తున్నాయని అధికారులు విశ్లేషించారు.

సంబంధిత పోస్ట్