నెయ్యిలో పొరపాట్లు జరుగుతున్నట్లు NDDB రిపోర్టు ఇచ్చింది: చంద్రబాబు

42చూసినవారు
నెయ్యిలో పొరపాట్లు జరుగుతున్నట్లు NDDB రిపోర్టు ఇచ్చింది: చంద్రబాబు
AP: తిరుమల లడ్డూ నెయ్యి వ్యవహారంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. "నెయ్యిలో పొరపాట్లు జరిగాయని ఎన్‌డీడీబీ నివేదిక స్పష్టం చేసింది. కల్తీ జరగలేదని సీబీఐ రిపోర్ట్ ఎక్కడా చెప్పలేదు. వైసీపీ హయాంలో తిరుమలకు రావాలన్నా, లడ్డూ తినాలన్నా భక్తులు భయపడే పరిస్థితి ఏర్పడింది. ప్రజలకు క్షమాపణలు మేము చెప్పాలా? బూతులు మేం భరించాలా?. ఇది ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశం. దోషులను కఠినంగా శిక్షిస్తాం. ఎవరినీ వదిలిపెట్టం" అని సీఎం స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్