PNG కనెక్షన్ కావాలా? ఈ నంబర్లకు కాల్ చేస్తే చాలు

0చూసినవారు
PNG కనెక్షన్ కావాలా? ఈ నంబర్లకు కాల్ చేస్తే చాలు
గృహావసర గ్యాస్ సిలిండర్ల ధరల పెరుగుదల, బుకింగ్ జాప్యం, డెలివరీ ఇబ్బందులతో సతమతమవుతున్న సామాన్యులకు పైపుడ్ నేచురల్ గ్యాస్ (PNG) ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయంగా మారుతోంది. హిందుస్థాన్ పెట్రోలియం (HPCL), భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ (BGL) ద్వారా నేరుగా ఇంటికే పైపుల ద్వారా గ్యాస్ సరఫరా చేసే ప్రక్రియను వేగవంతం చేసింది. ఈ కనెక్షన్ పొందాలనుకునే వారి కోసం తాజాగా హెల్ప్‌లైన్ నంబర్లను విడుదల చేసింది. హైదరాబాద్ - విజయవాడకు 040-23234701 ఫోన్ నంబర్, 9154313839 వాట్సాప్ నంబర్ అందుబాటులో ఉన్నాయి. కాకినాడకు 0884-2333326 ఫోన్ నంబర్, 9154313848 వాట్సాప్ నంబర్లను సంప్రదించవచ్చు.

సంబంధిత పోస్ట్