భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ప్రతిష్టాత్మక దోహా డైమండ్ లీగ్ నుండి వైదొలగారు. వెన్ను నొప్పితో బాధపడుతున్న నీరజ్ ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో కోలుకుంటున్నారు. కామన్వెల్త్, ఆసియా క్రీడలను దృష్టిలో ఉంచుకుని ఆయన అక్కడ 47 రోజుల శిక్షణా శిబిరంలో పాల్గొంటున్నారు. గత ఏడాది దోహా డైమండ్ లీగ్‌లోనే నీరజ్ 90.23 మీటర్ల జాతీయ రికార్డు సృష్టించారు. ఈ నెల 19న జరిగే లీగ్‌లో అర్షద్ నదీమ్, కెషోర్న్ వాల్కాట్ వంటివారు పాల్గొంటున్నారు.