నీట్‌ పీజీ-2025 రౌండ్‌-3 కౌన్సెలింగ్‌ పునఃప్రారంభం

6375చూసినవారు
నీట్‌ పీజీ-2025 రౌండ్‌-3 కౌన్సెలింగ్‌ పునఃప్రారంభం
నీట్‌ పీజీ–2025కు సంబంధించి మూడో రౌండ్‌ కౌన్సెలింగ్‌ను మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ (ఎంసీసీ) పునఃప్రారంభించింది. ఈ దశలో కొత్త రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించడంతో పాటు అదనపు సీట్లు కూడా చేర్చినట్లు తెలిపింది. 50 శాతం ఆల్‌ ఇండియా కోటా, డీమ్డ్‌, సెంట్రల్‌ యూనివర్సిటీలు, ఏఎఫ్‌ఎంఎస్‌ల పరిధిలోని పీజీ కోర్సులకు కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. సీట్ల కేటాయింపు ఫలితాలు 3న ప్రకటిస్తారు. 4 నుంచి 11వ తేదీ వరకు కళాశాలల్లో రిపోర్ట్‌ చేసుకునే అవకాశం ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్