NEET UG 2026 రీఎగ్జామ్‌ ఫలితాల డేట్ ఫిక్స్

11093చూసినవారు
NEET UG 2026 రీఎగ్జామ్‌ ఫలితాల డేట్ ఫిక్స్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన NEET UG 2026 రీ-ఎగ్జామ్ ఫలితాలను జులై 20లోపు విడుదల చేయనున్నట్లు జాతీయ పరీక్షల సంస్థ (NTA) తెలిపింది. పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో మే 3న జరిగిన పరీక్షను రద్దు చేసి, జూన్ 21న దేశవ్యాప్తంగా మళ్లీ నిర్వహించారు. ప్రస్తుతం మూల్యాంకన ప్రక్రియ తుది దశలో ఉండగా, జూన్ 25న విడుదల చేసిన తాత్కాలిక ఆన్సర్ కీపై వచ్చిన సుమారు 10 వేల అభ్యంతరాలను అధికారులు పరిశీలిస్తున్నారు. సరైన అభ్యంతరాలు తెలిపిన అభ్యర్థులకు ఫీజు తిరిగి చెల్లిస్తామని NTA వెల్లడించింది. ఫలితాలు విడుదలైన వెంటనే కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకటించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్