ఏపీ మద్యం పాలసీని పక్క రాష్ట్రాలూ అధ్యయనం చేస్తున్నాయి: మంత్రి కొల్లు

9456చూసినవారు
ఏపీ మద్యం పాలసీని పక్క రాష్ట్రాలూ అధ్యయనం చేస్తున్నాయి: మంత్రి కొల్లు
AP: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే మద్యం పాలసీని పక్క రాష్ట్రాలు కూడా అధ్యయనం చేస్తున్నాయని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. గురువారం శాసన మండలిలో ఆయన మాట్లాడారు. కూటమి సర్కార్ వచ్చాక రాష్ట్రంలో లిక్కర్‌ వల్ల చనిపోయినట్లుగా ఎక్కడా కేసు నమోదు కాలేదన్నారు. వైసీపీ ప్రభుత్వంలో మద్యం కుంభకోణం జరిగిందని, నాసిరకం మద్యం సరఫరా చేసి ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీశారని మంత్రి ఆరోపించారు. లిక్కర్ స్కాంపై త్వరలో వాస్తవాలు బయటకు వస్తాయన్నారు.