నెల్లూరు జిల్లా - Nellore

నెల్లూరు జిల్లాలో ఇద్దరు యువకుల హత్యలు కలకలం UPDATE

నెల్లూరు జిల్లాలో ఇద్దరు యువకుల హత్యలు కలకలం UPDATE

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం వద్ద వడ్డిపాలెం మెయిన్ రోడ్డులో ఇద్దరు యువకులను గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. మృతులు పెద్దపుత్తెడు గ్రామానికి చెందిన కుందుర్తి వెంకటేష్ (29), వెంగారెడ్డిపాలెం గ్రామానికి చెందిన బాలవెంకయ్య (27)గా గుర్తించారు. రాత్రి వరికోత మిషన్ లో డీజిల్ పోసేందుకు వెళ్తుండగా దుండగులు దారికాచి చంపినట్లు భావిస్తున్నారు. పాతకక్షలు, వివాహేతర సంబంధాల గొడవల నేపథ్యంలోనే ఈ హత్యలు జరిగాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కొడవలూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వీడియోలు


ఆంధ్రప్రదేశ్