నెల్లూరు లేడీ డాన్ అరుణకు బెయిల్ మంజూరు

13070చూసినవారు
నెల్లూరు లేడీ డాన్ అరుణకు బెయిల్ మంజూరు
AP: ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేసిన కేసులో అరెస్టయిన నెల్లూరు లేడీ డాన్ అరుణకు విజయవాడ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.25 వేల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. దీంతో శుక్రవారం ఆమె జైలు నుంచి విడుదల కానుంది. గతంలో రౌడీషీటర్ శ్రీకాంత్ పెరోల్ విషయంలోనూ, పలువురిని బెదిరించిన ఆరోపణల్లోనూ అరుణ పేరు వినిపించింది. ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.