నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం లోని ముస్తాపురం గ్రామంలో పారిశుద్ధ్యం చాలా దారుణంగా మారింది. గ్రామంలోని కాలువలలో పూడిక పేరుకుపోయింది. పంచాయతీ అధికారులు పట్టించుకోకపోవడంతో దారుణ పరిస్థితిని తలపిస్తుంది. మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తుంది. దుర్వాసనతో చుట్టుపక్కల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. పన్నుల సక్రమంగా కట్టించుకునే అధికారులు ప్రజల సమస్యలు పట్టించుకోరే అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.