అశ్వనీపురం: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

2864చూసినవారు
అశ్వనీపురం: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
ఆత్మకూరు- సోమశిల రహదారిపై అశ్వనీపురం సమీపంలో శనివారం చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో మొహతాజేబేగం(27) అనే మహిళ మృతి చెందారు. అశ్వనీపురానికి చెందిన ఈమె నెల్లూరులో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారు. విధులు ముగించుకుని శుక్రవారం రాత్రి షబ్బి అనే వ్యక్తితో ద్విచక్రవాహనంపై గ్రామానికి వస్తుండగా రోడ్డుపై ఉన్న మట్టి పెళ్లపైకి వాహనం ఎక్కడంతో వెనుక కూర్చున్న ఆమె జారిపడడంతో తలకు బలమైన గాయమైంది. ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

సంబంధిత పోస్ట్