ఆత్మకూరు: ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీ వేధింపులు.. వ్యక్తి ఆత్మహత్యాయత్నం

6చూసినవారు
ఆత్మకూరు: ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీ వేధింపులు.. వ్యక్తి ఆత్మహత్యాయత్నం
ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీ సిబ్బంది వేధింపులు తాళలేక ఓ వ్యక్తి పురుగు మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆత్మకూరు మండలం నరసాపురం గ్రామానికి చెందిన మాలకొండయ్య నాలుగేళ్ల క్రితం ఒక ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో రూ.ఆరు లక్షల రుణం తీసుకున్నారు. మూడు నెలలుగా ఆర్ధిక పరిస్థితి బాగాలేక వాయిదాలు కట్టలేదు. సదరు కంపెనీ సిబ్బంది శుక్రవారం మధ్యాహ్నం ఆయన ఇంటికి వచ్చి తాళం వేయాలని ప్రయత్నించారు. తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన పురగు మందు తాగారు. పరిస్థితి విషమంగా ఉండడంతో నెల్లూరు తీసుకెళ్లారు.