జిల్లా ఎస్. పి అజిత వెజెండ్ల ఆదేశాల మేరకు, ఆత్మకూరు డి. ఎస్. పి వేణుగోపాల్, సంగం సిఐ శ్రీనివాసులు రెడ్డి సూచనలతో ఏఎస్ పేట ఎస్ఐ షేక్ జిలాని బాషా తమ సిబ్బందితో కలిసి ఆత్మకూరు, వింజమూరు ప్రధాన రహదారి రాజవోలు వద్ద వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి, వాహనదారులకు పలు సూచనలు చేశారు. నిబంధనలు పాటించని పలు వాహనదారులకు అపరాధ రుసుము విధించారు.