ఆత్మకూరు మండలం బట్టేపాడు గ్రామంలో సోమవారం పింఛను డబ్బుల విషయంలో తండ్రి మామిడూరు పుల్లయ్య కుమారుడు మస్తానయ్య(33)పై కర్రతో దాడి చేయడంతో మస్తానయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న ఆత్మకూరు సిఐ గంగాధర్ సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.