ప్రస్తుతం పండగల రద్దీ నేపథ్యంలో, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు పాటించాలని ఆత్మకూరు ఎస్సై జిలాని సూచించారు. శనివారం మున్సిపల్ బస్టాండ్‌ను పరిశీలించిన ఆయన, ప్రయాణికులకు పలు సూచనలు చేశారు. అపరిచితులతో పరిచయాలు పెట్టుకోవద్దని, వారు అందించే ఆహార పదార్థాలను తినవద్దని హెచ్చరించారు. విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలని, చుట్టుపక్కల గమనిస్తూ ఉండాలని సూచించారు.