దువ్వూరులో జరగనున్న బీచ్ కబడ్డీ రాష్ట్ర స్థాయి జట్టు ఎంపిక

2చూసినవారు
సంగం మండలం దువ్వూరులో మే 7 నుంచి 10 వరకు జరగనున్న బీచ్ కబడ్డీ రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా జట్టును ఎంపిక చేసినట్లు కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ సతీశ్ తెలిపారు. జిల్లా నుంచి ఆరుగురు పురుషులు, ఆరుగురు మహిళలు తుది జట్లుగా ఎంపికయ్యారు. ఈ పోటీల్లో 26 జిల్లాల జట్లు పాల్గొంటాయి. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సహకారంతో క్రీడాకారులకు వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్