మంగళవారం చేజర్లలో ఆర్టీవో ఎం. రాములు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు హెల్మెట్ ధరించడం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. 19 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవారు వాహనాలు నడపరాదని సూచించారు. రోడ్డు నియమాలను పాటించడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చని, ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నిబంధనలను కచ్చితంగా పాటించాలని విద్యార్థులను కోరారు. ప్రాణం విలువైనదని, కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.