నెల్లూరులో సీపీఎం నేత పెంచలయ్య హత్యకు నిరసనగా ఆత్మకూరులో చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది. పోలీసులు ఆందోళన విరమించాలని కోరగా, ఆందోళనకారులతో వాగ్వాదం చోటుచేసుకుంది. గంజాయి మాఫియాకు వ్యతిరేకంగా తమ పోరాటానికి సహకరించాలని సీపీఎం నాయకులు పోలీసులను కోరారు. అన్యాయంగా ప్రాణాలు తీస్తుంటే చూస్తూ ఊరుకోవాలా అని వారు ప్రశ్నించారు. ఈ ఘటనతో కొంతసేపు గందరగోళం నెలకొంది.