కండలేరులో 11 కిలోమీటర్ల మేర కట్ట నిర్మించి 30 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో, దానిని పటిష్ఠం చేయాల్సిన ఆవశ్యకత ఉందని బీజేపీ నమామి గంగే రాష్ట్ర కన్వీనర్ మిడతల రమేశ్ అన్నారు. డ్యాం సాధారణ నిర్వహణకు నిధులు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ మేరకు శుక్రవారం రాజ్యసభ ఎంపీ బీద మస్తాన్ రావుకు వినతిపత్రం అందజేసి, కండలేరు అభివృద్ధికి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.