ఆత్మకూరు సర్కిల్ పరిధిలో సంక్రాంతి పండుగ సందర్భంగా కోడిపందాలు, పేకాట, ఇతర రకాల జూదాలు ఆడడం నిషేధమని ఆత్మకూరు సీఐ గంగాధర్ తెలిపారు. పండుగను సాంప్రదాయబద్ధంగా, సంతోషంగా నిర్వహించుకోవాలని, అసాంఘిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. గ్రామాలలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ముందస్తుగా సిబ్బందితో నిఘా ఏర్పాటు చేసినట్లు సీఐ పేర్కొన్నారు.