మర్రిపాడు: ఈదురు గాలుల వల్ల కూలిన రెండు స్తంభాలు

61చూసినవారు
మర్రిపాడు: ఈదురు గాలుల వల్ల కూలిన రెండు స్తంభాలు
ఈరోజు సాయంత్రం సమయంలో వీచిన భయంకరమైన ఈదురు గాలులు నెల్లూరు జిల్లా లోని పలు ప్రాంతాల్లో ప్రజలను ఇబ్బందులకు గురి చేశాయి. మర్రిపాడు మండలం లోని రామనాయుడు పల్లి లో చెట్లతో పాటు రెండు విద్యుత్ స్తంభాలు కూడా కూలిపోయాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. గాలులు వీస్తున్న సమయంలో అటుగా ఎవరూ లేకపోవడంతో అదృష్టవశాత్తు ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. మరికొన్ని గ్రామాల్లోనూ చెట్లు నేలకొరిగాయి.

సంబంధిత పోస్ట్