నెల్లూరు జిల్లా సంగం మండలం సిద్ధిపురం క్లస్టర్‌లో జరిగిన మహానాడు కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు.
టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఆనం పార్టీ జెండాను ఆవిష్కరించి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్వహించిన డిజిటల్ మహానాడును నాయకులతో కలిసి లైవ్‌లో వీక్షించారు.