ఆత్మకూరుకు చెందిన ఎన్నారై మీరా మొహిద్దిన్ అమెరికా యుద్ధ విధానంపై తీవ్రంగా స్పందించారు. 30 ఏళ్ల పాటు అరబ్ దేశంలో నివసించిన అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ, ఇరాక్ పై దాడుల సమయంలో అక్కడే ఉన్నామని తెలిపారు. బక్రీద్ పండుగ రోజున సద్దాం హుస్సేన్ కు ఉరిశిక్ష అమలు చేసిన ఘటనను ప్రస్తావించారు. అరబ్ దేశాలపై ఏదో ఒక దేశాన్ని అడ్డం పెట్టుకుని యుద్ధాలు చేయడం అమెరికాకు అలవాటుగా మారిందని విమర్శించారు. ప్రపంచ శాంతి స్థాపనకు శక్తివంతమైన దేశాలు ముందుకు రావాలని సూచించారు.