సీతారామపురం గ్రామంలోని పడమటి వీధిలో డ్రైనేజీ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినడంతో మురుగు నీరు ఇళ్లలోకి చేరుతోంది. రోడ్డుపై కూడా మురుగు నిల్వ ఉండటంతో ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. దుర్వాసన, వ్యాధుల వ్యాప్తిపై గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని పంచాయతీ అధికారులను కోరుతున్నారు.