సంగం: ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన లారీ

4చూసినవారు
సంగం మండలం దువ్వూరు సమీపంలోని జాతీయ రహదారిపై అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. కనిగిరి నుంచి చెన్నై వెళ్తున్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురికి స్వల్ప గాయాలు అయ్యాయి. వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న ఎస్సై రాజేష్ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.