సంగం మండలంలో ఈదురు గాలుల బీభత్సం

0చూసినవారు
సంగం మండలంలో ఈదురు గాలుల బీభత్సం
సంగం మండలంలో భారీ ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. తలుపురుపాడు, తరుణవాయి, కొరిమెర్ల, జంగాల కండ్రిక గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు విరిగిపడటంతో పాటు, పలు చోట్ల భారీ చెట్లు నేలకొరిగాయి. దీనితో విద్యుత్ లైన్లు దెబ్బతిని అనేక గ్రామాలు అంధకారంలో మునిగిపోయాయి. సమాచారం అందిన వెంటనే విద్యుత్ శాఖ సిబ్బంది రంగంలోకి దిగి, యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తు పనులు చేపట్టి, పునరుద్ధరణ పనులను వేగవంతం చేస్తున్నారు.

ట్యాగ్స్ :